ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిన. మాజీ ఎమ్మెల్యే కడు బండి
కొత్తవలస, సూర్య : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సోమవారం అర్ధాన్న పాలెం సమీపంలో గల తన నివాసంలో నాయకులకు కార్యకర్తలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సరళి, ఫలితాలు, అధికారుల వ్యవహారశైలిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తీరు పరిశీలిస్తే అధికార పార్టీ ఎంతటి దౌర్జన్యాలకు పాల్పడిందో అర్థమవుతోందని విమర్శించారు. కొందరు అధికారులు అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. నియోజకవర్గంలో తక్కువ మెజార్టీతో ఓటమి చెందిన అభ్యర్థులు రీకౌంటింగ్ కోరినా అధికారులు అవకాశం కల్పించకపోవడం అన్యాయమని అన్నారు. ముఖ్యంగా వేపాడ ఎన్నికల అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
2024 ఎన్నికలతో పోల్చి చూస్తే ప్రస్తుత ఎన్నికల్లోకుటమి ప్రభుత్వానికి వచ్చిన మెజార్టీ తగ్గిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులకు కార్యకర్తలు, అభిమానులు అధైర్యపడవద్దని, వారికి తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. కార్యకర్తలు, అభిమానులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఎన్నికలు సహాయ సహకారాలు అందించిన పార్టీ నాయకులకు అభిమానులను ఆయన అభినందించారు ఎప్పుడుప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జామి మండలం ZPTC వాడ్ర ఎర్ని తులసి త్రివేణి మాజీ DCCB ఛైర్మన్ వేచలపు చినరామునాయుడు , మండల అధ్యక్షులు గొర్లె రవికుమార్ ఒబ్బిన నాయుడు .కుమార్ . వాకాడ రాంబాబు పినిశెట్టి వెంకటరావు , విరోతి కొండలరావు . సంబరాజు లెంక వరహాలు , నూకల కస్తూరి గ కునిరెడ్డి వెంకటరావు మరియు నియోజకవర్గం ముఖ్య నాయకు, mptc లు, మాజీ సర్పంచ్ లు, నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు