కోర్టు కు వచ్చిన కక్షి దారులకు న్యాయ సహాయం అందించాలి * సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ *
బొబ్బిలి, సూర్య : జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా బొబ్బిలి కోర్టు ఆవరణలో మీటింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ లో న్యాయవాదులు కోర్టు సిబ్బంది కక్షిదారులు పాల్గొన్నారు. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మండల న్యాయ సేవా సంస్థ యొక్క విధులు ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇందులో భాగంగా ఉచిత న్యాయవాదిని అందించడం మరియు ప్రీ లిటిగేషన్ కేసుల గురించి వివరించినారు. కోర్టుకు వచ్చిన కక్షిదారులపై వారి యొక్క సమస్యను తెలుసుకుని తగిన పరిష్కారం అందించవలసిన బాధ్యత కోర్టు సిబ్బంది కి ఉందని సీనియర్ సివిల్ జడ్జి, బొబ్బిలి ఏ రాధాకృష్ణమూర్తి చెప్పారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే వారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి అర్జీ పెట్టుకోమని చెప్పారు. అర్జీ పెట్టుటకు ఎటువంటి ఖర్చు ఉండదు అని తెలిపారు. అలాగే ఎవరైనా లాయరు పెట్టుకొలేని స్తోమత కలిగి ఉన్నట్లయితే పెండింగ్లో ఉన్న కేసులకు వారికి ఉచిత న్యాయవాదిని అందిస్తామని చెప్పారు. ఇందులోభాగంగా ప్రిన్సిపాల్ జూనియర్ జడ్జి శ్రీమతి హేమా స్రవంతి జానకి రామ్, అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ శ్రీమతి ఎం. రోహిణి రావు మరియు కక్షిదారులు మరియు సీనియర్ న్యాయవాదులు ఈ యొక్క మీటింగ్ లో పాల్గొన్నారు.