BREAKING
ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా!

ఓటమి చెందినా మారని కూటమి నేతలు* *వైసీపీ శ్రేణులపై దాడులు అప్రజాస్వామికం* *మాజీ మేయర్ మహమ్మద్ వసీం*

Select Suryaa Now
ఓటమి చెందినా మారని కూటమి నేతలు*  *వైసీపీ శ్రేణులపై దాడులు అప్రజాస్వామికం*  *మాజీ మేయర్ మహమ్మద్ వసీం*

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి చెందినా  కూటమి నేతలలో మార్పు రాలేదని మాజీ మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. నగరంలోని 56వ డివిజన్ లో వైసీపీ కార్యకర్తలపై టీడీపీనేతలు దాడి చేయడంతో గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను మాజీ మేయర్ మహమ్మద్ వసీం కార్పొరేటర్లతో కలసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నగరంలో ప్రశాంతత కరువైందన్నారు.వైసీపీ హయాంలో నాటి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నగర ప్రశాంతతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నగరంలో దాడులు,దౌర్జన్యాలు,భూ కబ్జాలు పెరిగిపోయాయన్నారు.వీటితో విసిగిపోయిన ప్రజలు వైసీపీ తోనే నగర ప్రశాంతత సాధ్యమవుతుందని భావించి మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానంతో పాటు 21 డివిజన్ లలో వైసీపీని గెలిపించారన్నారు.కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక 56 వ డివిజన్ లో వైసీపీ  నాయకులపై ఇళ్లలో దూరి  దాడులు చేయడం  అప్రజాస్వామికమన్నారు.దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు మారాలని లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ ఖాజా , జ్ఞానేశ్వర్,సుకేష్,బలరాం,మాజీ కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్, ఇషాక్, కమల్ భూషణ్ లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్