BREAKING
డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ఘన విజయంపై ఎమ్మెల్యే బీవీ హర్షం

Select Suryaa Now
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ఘన విజయంపై ఎమ్మెల్యే బీవీ హర్షం

 
ఎమ్మిగనూరు,సూర్య ప్రతినిధి 
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు రెండు జెడ్పీటీసీ, 39 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారని ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గెలుపొందిన ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రెండు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 39 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారని, ఎంపీపీ స్థానాలను కూడా కూటమి దక్కించుకుందని పేర్కొన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ పునరావృతం చేశారని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు తమ ఓట్ల ద్వారా మద్దతు తెలిపారని అన్నారు.
2024 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లభించిన ప్రజాదరణను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటర్లు కొనసాగించడం సంతోషకరమన్నారు. గత 30 నుంచి 40 ఏళ్లుగా ఎమ్మిగనూరు మండలంలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుని తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయం తమకు మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ, 2029 సాధారణ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారనే ధీమాను ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో విజయం సాధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో పాటు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ చైర్మన్ కురుమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
జిలాని, సూర్య టౌన్ ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా