11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:-ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం దీర్ఘకాలంగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి. రామకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
మిగిలిన ఉద్యోగుల పెన్షన్ సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని విజయ్ భాస్కర్ కోరారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..