BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ...

Select Suryaa Now
రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ...


- నియోజకవర్గ స్థాయిలో ముగ్గురు విజేతల ఎంపిక..
-  రాష్ట్రస్థాయి పోటీలకు ఒకరికి అవకాశం

నరసన్నపేట, నవంబర్ 11 మేజర్ న్యూస్:

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసన్నపేట నియోజకవర్గ స్థాయి విద్యార్థుల పోటీలు బుధవారం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (GHS)లో నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడ శాంతారావు, ఎంఈఓ-2 పేడాడ దాలినాయుడు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేశారు.

విజేతల వివరాలు:

* ప్రథమ స్థానం: పి. సూర్య – జెడ్పీహెచ్‌ఎస్, కంబకాయ.

* ద్వితీయ స్థానం: డి. ప్రణతి – జెడ్పీహెచ్‌ఎస్, శ్రీముఖలింగం.

* తృతీయ స్థానం: బి. భువన శృతి – జెడ్పీహెచ్‌ఎస్, కంబకాయ.

ఈ ముగ్గురు విజేతల్లో ఒకరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే విద్యార్థి మరింత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.