యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం
ఖాతాదారుల సమక్షంలో యూనియన్ బ్యాంక్ వార్షికోత్సవ వేడుకలు.. అమలాపురం యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం జి.వి.మాల్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ అమలాపురం బ్రాంచిలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ పృథ్వి ఆధ్వర్యంలో ఖాతాదారులు, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు కలిసి కేక్ కట్ చేసి వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఖాతాదారులు ఇండుగుల శ్రీనివాసరావు, ఇండుగుల శివరామ ప్రసాద్, వీరమల్లు శ్రీనివాసరావు, తోట బాబ్జీ, రిటైర్డ్ ఉద్యోగులు కుడుపూడి ఈశ్వరరావు, సాపి సంపత్ రావు, వి.వి.ఎస్.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ అమలాపురం బ్రాంచ్ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం బ్రాంచ్ సిబ్బంది అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.