BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

పాతపట్నం ‘ఉమా సినీ మ్యాక్స్’ పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దాడులు.

Select Suryaa Now
పాతపట్నం ‘ఉమా సినీ మ్యాక్స్’ పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దాడులు.

 

పాతపట్నం నవంబర్ 11,మేజర్ న్యూస్:

అధిక ధరలకు విక్రయాలపై కేసు నమోదు, శాంపిళ్ల సేకరణ.
 

పాతపట్నం పట్టణంలోని ప్రముఖ సినిమా థియేటర్ ‘ఉమా సినీ మ్యాక్స్’ పై ఆహార భద్రతా శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. థియేటర్ ప్రాంగణంలోని క్యాంటీన్‌లో తినుబండారాలు, కూల్ డ్రింక్స్ తదితర ఆహార పదార్థాలను ప్రభుత్వం నిర్ణయించిన ముద్రిత గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే అధిక ధరకు విక్రయిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లు స్వయంగా గుర్తించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్, నిబంధనల ఉల్లంఘనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అలాగే నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం క్యాంటీన్‌లోని పలు ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, నిర్దేశిత నిబంధనల ప్రకారం శాంపిళ్లను సేకరించి సమగ్ర విశ్లేషణ కోసం ప్రయోగశాల పరీక్షల నిమిత్తం పంపుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. సినిమా వీక్షకుల జేబులు గుల్ల చేస్తూ నాసిరకం లేదా అధిక ధరలతో ఆహార పదార్థాలు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.