కివీస్ గడ్డపై గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగిన టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడింగ్ వేళ డబుల్ ధమాకా!
భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు పెట్టారు. ప్రస్తుతం భారత జట్టుతో కలిసి న్యూస్లాండ్ పర్యటనలో ఉన్న ఆయన, తన ప్రియురాలికి అత్యంత రోమాంటిక్ రీతిలో ప్రపోజ్ చేసి నిశ్చితార్థం చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రముఖ నటి, మోడల్ అయిన సమ్రీన్ కౌర్‌తో ప్రేమలో ఉన్న అర్ష్‌దీప్, కివీస్ గడ్డపై ఆమెను వివాహం చేసుకుంటానని అధికారికంగా ప్రకటించారు. మోకాళ్లపై కూర్చుని సమ్రీన్‌కు రింగ్ తొడుగుతున్న అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఐపీఎల్ మెగా ట్రేడింగ్‌లో భాగంగా తాజాగా ముంబై ఇండయన్స్ జట్టులోకి మారిన అర్ష్‌దీప్ సింగ్‌కు, వ్యక్తిగతంగా ఈ రోజు అత్యంత ప్రత్యేకంగా నిలిచింది. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్న తరుణంలోనే, తన ప్రేయసి సమ్రీన్ కౌర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అర్ష్‌దీప్ డబుల్ సంతోషాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను సమ్రీన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, జీవితం తమకు ఒకరినొకరు బహుమతిగా ఇచ్చిందని, ఇకపై జీవితాంతం కలిగుంటామంటూ ఎమోషనల్ క్యాప్షన్ జతచేశారు.
భారత జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకెళ్తున్న అర్ష్‌దీప్ సింగ్ కెరీర్‌లో ఈ కీలక ఘట్టం చోటుచేసుకోవడంతో క్రీడాకారులు, ప్రముఖులు పెద్దఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించి ప్రియురాలిని సర్ప్రైజ్ చేసిన అర్ష్‌దీప్ తీరు ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.