షిఫ్ట్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆమదాలవలస, నవంబర్ 11, మేజర్ న్యూస్
విద్యుత్ సబ్ స్టేషన్ లో ఎంతోకాలంగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు షిఫ్ట్ ఆపరేటర్లు ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంతో కాలంగా సబ్ స్టేషన్ లో పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు విన్నవించారు. షిఫ్ట్ ఆపరేటర్ల సమస్యలు విన్న ఎమ్మెల్యే రవికుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు షిఫ్ట్ ఆపరేటర్లు తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో జిల్లా విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగు కార్మికులు బి.రామినాయుడు, జనార్ధన రావు, కృష్ణ చంద్ర, పండ, తదితరులు ఉన్నారు.