BREAKING
ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి పన్నేండేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ.. సూర్య సరసన నటించడంపై నజ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు

Select Suryaa Now
ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు

ఒంగోలు:ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌ (Webland) భూరికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న విచ్చలవిడి కేటుగాళ్ల ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అధీకృత లాగిన్ వివరాలను అక్రమంగా ఉపయోగించి భూమి హక్కులను మార్చడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది.

ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిధిలోని ఇండ్లచెరువు, పడమరలక్ష్మీపురం గ్రామాల్లో ఈ భూకోత పర్వం వెలుగుచూసింది. ఈ గ్రామాల్లో మొత్తం 6.55 ఎకరాల పరిమితి గల భూమికి సంబంధించి 30 మంది యజమానుల వెబ్‌ల్యాండ్‌ రికార్డులను నిందితులు ట్యాంపరింగ్ చేశారు. అసలైన హక్కుదారుల పేర్లను తొలగించి, ఇతరుల పేర్లపైకి రికార్డులు మార్పు చేసి వెబ్‌ల్యాండ్‌లో నవీకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

అధికారుల లాగిన్ సమాచారాన్ని ఈ ముఠా ఎలా చేజిక్కించుకుందనే కోణంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ అక్రమాల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, సహకరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.