కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి
ఆమనగల్లు రంగారెడ్డి:
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్‌నుమంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లుమర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికనుఅందజేశారు.అనంతరంకల్వకుర్తినియోజకవర్గంలోని పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించారు. పట్టభద్రుల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని గోలి శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ సూచించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, సుభాష్, బుచ్చిబాబు,బుజ్జి, శేఖర్,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నరు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.