andhrapradesh
జాతీయ స్థాయి అండర్-19 బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ కు అఖిల్ ఎంపిక
నగరం, మేజర్ న్యూస్:
మండల కేంద్రమైన నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో ప్రథమ ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థి వైబిఎస్ఎం అఖిల్ జాతీయ స్థాయి అండర్-19 బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తన ప్రతిభను కనపర్చి చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో నిర్వహించనున్న పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి, ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ప్రసన్న బాబు, ఇంటర్మీడియట్ ఇంచార్జి ప్రిన్సిపల్ నాయుడు రెడ్డి, కళాశాల సూపర్డెంట్ ఏ. అమరేష్ రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జాతీయ స్థాయిలో విజయం సాధించాలని అఖిల్ కు అభినందనలు తెలిపారు.