ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
సూర్య జైపూర్ : జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం ఒక ఫిర్యాదు అందగా, అది రెవెన్యూ శాఖకు సంబంధించినదిగా అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీపతి బాపురావు మాట్లాడుతూ.. మండల ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి.శ్రీనివాస్, వ్యవసాయ అధికారి సైదా, వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్‌తో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.