BREAKING
గ్లోబల్ లగ్జరీ యాచ్ మార్కెట్లో రాణిస్తున్న ట్యునీషియా బోట్‌బిల్డర్స్ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి... ఎంఎల్ఏ " కోండ్రు " విమానయాన ఇంధనంలో విప్లవం: డీజీసీఏ, నీతి ఆయోగ్, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ సమన్వయం ముందస్తు ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యం * హాజరైన ఐసిడిఎస్ పిడి బాలామణి * దీపావళి టపాసుల ఉన్మాదంపై బాలీవుడ్ నటుడి ఆగ్రహం: అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇల్లు, బాల్కనీ కేకేఆర్ సంస్థలో పెరిగిన అసెట్ సేల్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిన. మాజీ ఎమ్మెల్యే కడు బండి నటుడిగా మారకముందు హోటల్‌లో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వలిచాను: బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు నవంబర్ 13న అత్యధిక సంఖ్యలో అగ్నివీర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ఘన విజయంపై ఎమ్మెల్యే బీవీ హర్షం అంగన్వాడి కార్యకర్తలకు పోషణ అభి.. పద్ధతి బి రౌండ్ .2 పైన శిక్షణ భారత్-ఓమాన్ నావికాదళాల విన్యాసాలు జాతీయ స్థాయి అండర్-19 బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ కు అఖిల్ ఎంపిక 'కళా' విహీనం! ఎన్టీఆర్, త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై సందిగ్ధత: భారీ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడటానికి అసలు కారణమిదేనా

ఎట్టకేలకు కడెం నీటిని విడుదల చేసిన అధికారులు - ఆనందంలో రైతులు

Select Suryaa Now
ఎట్టకేలకు కడెం నీటిని విడుదల చేసిన అధికారులు - ఆనందంలో రైతులు
సూర్య, జన్నారం : కడెం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలం తపాలాపూర్ రహదారిపై ఆ గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేయడంతో అధికార యంత్రాంగం స్పందించి ఆఘమేఘాలపై కడెం నీటిని విడుదల చేశారు. దీంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు. ఏకంగా మూడు గంటల పాటు రహదారిపై బైఠాయించి నినాదాలు చేయడంతో అటు పోలీసులు, ఇటు నీటిపారుదల శాఖ అధికారులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులు ససేమిరా అంటూ రాస్తారోకో కొనసాగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంట చేతికొచ్చే సమయంలో కడెం నీటిని నిలుపుదల చేసి రైతులకు ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆరు నూరైనా కడెం నీటిని ఆయకట్టు దారులకు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాల్సిందేనని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో మంచిర్యాల ఎసిపి ప్రకాష్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్న శాంతియుతంగా నిరసన తెలుపాలే తప్ప బాటసారులకు ఇబ్బంది కలిగించవద్దని అన్నారు. సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించుకుంటే మంచిది అన్నారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ డిఈ వెంకటేశం సైతం రైతులతో మాట్లాడారు. జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నైనాల గోవర్ధన్ హైదరాబాదులోని చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడారు. ఇక్కడి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని, ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేయించాలని, లేకుంటే రైతాంగం ఇబ్బంది పడాల్సి వస్తుందని వివరించడంతో ఆఘమేఘాలపై ఆ అధికారి ఫోన్లో కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడి కడెం నీటిని విడుదల చేయించారు. నీటిని విడుదల చేయించినట్లు రైతులకు ఫోన్లో చెప్పడంతో రాస్తారోకో విరమించారు. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాస్తారోకోలో తపాలాపూర్ మాజీ సర్పంచ్ నైనాల తిరుపతి, చింతగూడ సింగిల్ విండో వైస్ చైర్మన్ కమ్మల విజయ ధర్మ, రైతు నాయకులు మిక్కిలినేని రాజశేఖర్, గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.