BREAKING
విజేతలకు అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్... కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల భద్రపరిచే గోదాంను తనిఖీ నిర్వహించిన  జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కల్యాణం సినిమా: డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన ఆకర్షణగా అంతర్జాతీయ వాతావరణ సదస్సు! జాతీయ స్థాయి రోల్ ప్లే పోటీలకు ఈదులవలస పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు నగరం మండల ఎంపీపీగా మోర్ల స్వరూప రాణి హిరమండలం జడ్పిటిసి త్రివేణి కి కేంద్ర మంత్రి అభినందనలు సీతారామ బద్ధ క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా నిఘా: టీనేజర్ల గుర్తింపునకు కృత్రిమ మేధ ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు నితీష్ తివారీ ‘రామాయణం’ మేజిక్: దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న కేరళలోని ప్రసిద్ధ జటాయు రాక్ ప్రజాక్షేత్రంలో గెలిచారు... ప్రజల గుండెల్లో నిలవండి! ఉక్రెయిన్ ఆర్థిక కార్యక్రమంపై ఐఎంఎఫ్ సమీక్ష ప్రారంభం

అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం :జడ్జి రూపశ్రీ

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం :జడ్జి రూపశ్రీ


కనిగిరి ,మేజర్ న్యూస్ :జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని సోమవారం కనిగిరి సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,జడ్జి బి. రూపశ్రీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి బి. రూపశ్రీ మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ – 1987 దేశవ్యాప్తంగా 1995 నవంబర్ 9వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని, ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ఏ ప్రకారం సమాజంలోని పేద, బలహీన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సమాన న్యాయం అందించడంతో పాటు ఉచిత న్యాయ సహాయం కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని వివరించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.ఉచిత న్యాయ సహాయం కోసం మండల న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.న్యాయ సేవాధికార సంస్థ ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 15100 గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, న్యాయవాదుల గుమస్తాలు, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, స్థానిక ప్రజలు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.