BREAKING
న్యూజిలాండ్‌తో సిరీస్: అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌ రేసులో నిలిచిన గుర్నూర్ బ్రార్ **బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన పావన మూర్తి.. * ప్రథమ వర్ధంతి సభలో కొనియాడిన ప్రముఖులు * పబ్లిక్ పరీక్షల తరహాలోనే ఎస్ఏ-1 పరీక్షలు.. డిప్యూటీ డిఇఓ. గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ఆపాలంటూ... -ఆగిర్యాల లో కొనసాగుతున్న మహా నిరాహార దీక్ష ఇందిరమ్మ ఇళ్లలో వెలుగును నింపిన దీపావళి ఓట్ చోరీని అరికట్టాలి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలి! ఫామ్ కోల్పోయి ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన మార్నస్ లబుషేన్: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం లంచం అడిగితే సమాచారం ఇవ్వండి...! * ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ * అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల వివరాలు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు: ఉస్మాన్ ఖ్వాజా 'శాండ్‌పేపర్‌గేట్' బాంబు నూటికి నూరు శాతం నిజమంటూ ప్రకటన న్యాయం అందరి హక్కు * లకోర్టు ఆవరణలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం * రైల్వే పెన్షనర్లకు శుభవార్త! జయచంద్ర నాయుడుకు పాలురు ప్రజల ఘన సన్మానం తెలంగాణలో బియ్యం ధరలకు అడ్డుకట్ట.. గరిష్ట విక్రయ ధర (MRP) ఖరారు చేసిన ప్రభుత్వం!

విజేతలకు అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్...

Select Suryaa Now
విజేతలకు అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్...

శ్రీకాకుళం, సూర్య :  ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించిన కూటమి అభ్యర్థులు సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం నగరంలోని ప్రజాసదన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు ఈ ఆత్మీయ సమావేశం కొనసాగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను కేంద్ర మంత్రి ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర మంత్రి, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారితో ప్రత్యేకంగా చర్చించారు.

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయంతో ట్రిపుల్ ఇంజిన్ వేగాన్ని సంతరించుకుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేస్తూ శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు తదితరులు పాల్గొన్నారు.