BREAKING
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఢిల్లీలో యమునా నదిపై తొలి విహార నౌక సేవలు ప్రారంభం, రేపు లాంఛనంగా ప్రారంభం భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు దాతరపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు

గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ఆపాలంటూ... -ఆగిర్యాల లో కొనసాగుతున్న మహా నిరాహార దీక్ష

Select Suryaa Now
గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ఆపాలంటూ... -ఆగిర్యాల లో కొనసాగుతున్న మహా నిరాహార దీక్ష

 

కొందుర్గు (రంగారెడ్డి):  

కొందుర్గు మండల పరిధిలోని ఆగిర్యాల లో మహనీయుల విగ్రహాలకు అడ్డుగా నిర్మాణం చేస్తున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని వెంటనే ఆపాలని ఆ గ్రామ యువకులు కొనసాగిస్తున్న మహా నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. రెండవ రోజైన ఆదివారం మహా నిరాహార దీక్షకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ ఎదిర రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని గ్రామపంచాయతీ భవనాన్ని మరోచోట నిర్మాణం చేయాలని అన్నారు.  మూడవరోజు సోమవారం యువకులు యధావిధిగా నిరాహార దీక్షను కొనసాగించారు.  ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా తాము నిరాహార దీక్షను చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు స్పందించడం లేదని, తాము గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, మహనీయుల విగ్రహాలకు అడ్డుగా గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మాణం చేయవద్దని, మరోచోట గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మాణం చేయాలని కోరుతున్నామని,  దీనికి ఎలాంటి ఖర్చు కాదని,  కానీ అధికారులు మాత్రం తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చావనైనా చస్తాం ...కానీ న్యాయం జరిగే వరకూ దీక్షను విరమించేది లేదని వారు అంటున్నారు.  ఇకనైనా మండల, జిల్లా స్థాయి అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం కనుక్కొని, నిరాహార దీక్షను విరమింపజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీక్షకు బిక్షపతి, రత్నం, లక్ష్మణ్, జగన్, పసుపుల ప్రశాంత్, రాజేష్, రాజు, రవీందర్, పి చుక్కయ్య, ఎం పద్మమ్మ, ఎం మంజుల, అజయ్, ఎం నరేష్, సి రాజు లు మద్దతు తెలిపారు.

ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.