BREAKING
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఢిల్లీలో యమునా నదిపై తొలి విహార నౌక సేవలు ప్రారంభం, రేపు లాంఛనంగా ప్రారంభం భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు దాతరపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు

తెలంగాణలో బియ్యం ధరలకు అడ్డుకట్ట.. గరిష్ట విక్రయ ధర (MRP) ఖరారు చేసిన ప్రభుత్వం!

Select Suryaa Now
తెలంగాణలో బియ్యం ధరలకు అడ్డుకట్ట.. గరిష్ట విక్రయ ధర (MRP) ఖరారు చేసిన ప్రభుత్వం!

హైదరాబాద్:రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మార్కెట్లో బియ్యం కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. వినియోగదారులను దోపిడీ నుంచి కాపాడేందుకు మరియు అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు రకాల వారీగా బియ్యం గరిష్ట విక్రయ ధరలను (MRP) నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వివిధ రకాల బియ్యం కిలో గరిష్ట ధరల వివరాలు:

 * BPT, KNM రకాలు: కిలో గరిష్ట ధర రూ. 66

 * RNR, తెలంగాణ సోనా రకాలు: కిలో గరిష్ట ధర రూ. 74

 * HMT, JSR రకాలు: కిలో గరిష్ట ధర రూ. 79

ప్రభుత్వం నిర్ణయించిన ఈ గరిష్ట పరిమితుల కంటే ఎక్కువ ధరలకు బియ్యం విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. బ్లాక్ మార్కెటింగ్ లేదా కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించే షాపులు, మిల్లులపై దాడులు నిర్వహించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.