andhrapradesh
పబ్లిక్ పరీక్షల తరహాలోనే ఎస్ఏ-1 పరీక్షలు.. డిప్యూటీ డిఇఓ.
సూర్య న్యూస్.
అద్దంకి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎస్ ఏ -1 పరీక్షలను డిప్యూటీ డీఈవో గంగాధర్ రావు, ఎంఈఓ2 కెవి శ్రీనివాసరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఈఓ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే ఎస్ఏ-1 పరీక్షలను భవిష్యత్తులో జరిగే పబ్లిక్ పరీక్షల వలె అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం పక్క మండలాల నుంచి ఉపాధ్యాయులను ప్రతి పాఠశాలకు అబ్జర్వర్లుగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. లాంగ్వేజ్ సబ్జెక్ట్‌లకు నాన్-లాంగ్వేజ్ టీచర్లను, నాన్-లాంగ్వేజ్ సబ్జెక్ట్‌లకు లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లను అబ్జర్వర్లుగా కేటాయించామని వివరించారు. ఈ స్కూల్ లెవెల్ అబ్జర్వర్లు ప్రతిరోజు పరీక్షా విధానాన్ని పరిశీలించి ఎంఈఓలకు నివేదిక అందజేస్తారని తెలిపారు. వాల్యుయేషన్‌లోనూ పారదర్శకత కోసం 5 శాతం పేపర్లను ఇతరులతో పరిశీలించేలా సరికొత్త విధానం తెచ్చినట్లు తెలిపారు. ఈ వినూత్న విధానాల ద్వారా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మానసికంగా సిద్ధమవడమే కాకుండా, ఉత్తమ ఫలితాలు సాధించడానికి దోహదపడతాయన్నారు.