జయచంద్ర నాయుడుకు పాలురు ప్రజల ఘన సన్మానం
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు మండల జయచంద్ర నాయుడుకు పాలురు పంచాయతీ ప్రజలు ఘనంగా సన్మానించారు. సోమవారం చిత్తూరులోని ఆయన స్వగృహంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఆత్మీయంగా అభినందనలు తెలిపారు.ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చిత్తూరు మండలంలోని ఏడు సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంపై పాలూరు పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జయచంద్ర నాయుడు నాయకత్వంలో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాన్ని అభినందిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే ప్రజల ఆదరణకు, ఎన్నికల విజయానికి ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు, టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఆదరించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దిశానిర్దేశంలో మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా పాలూరు పంచాయతీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, సుధీర్, వెంకటేష్, మల్లేశ్వరి నాయుడు, హనుమంత్ నాయుడు, ప్రకాష్, మంజు, మోహన్ నాయుడు, మధు, సుధాకర్, నరసింహులు, పాలూరు పంచాయతీ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్