ఇందిరమ్మ ఇళ్లలో వెలుగును నింపిన దీపావళి
ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి కాంతులు.
సంబరాల్లో పాలు పంచుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
పార్టీలకు అతీతంగా పండుగ ఆనందంలో భాగస్వామ్యం.. సొంతింటి కల నెరవేరిన కుటుంబాలతో ఆత్మీయ మమేకం
సత్తుపల్లి మేజర్ సూర్య న్యూస్:
(కిరణ్ కుమార్ ఆరిక)
పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఇందిరమ్మ ఇళ్లలో ఈ దీపావళి పండుగ మరింత ప్రత్యేకంగా మారింది. కేవలం ఇళ్ల నిర్మాణంతోనే కాకుండా, ఆ ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల ఆనందాల్లోనూ భాగస్వాములవుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆత్మీయతను చాటుకున్నారు. కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మధ్య ఆమె దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ సంతోషాలను పంచుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాగమయి దయానంద్ రాకతో గ్రామాలలో పండుగ సందడి మరింత పెరిగింది. గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్మన్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఈ వేడుకల్లో పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎమ్మెల్యేతో కలిసి తమ సొంతింటిలో దీపావళి జరుపుకోవడం ఒకప్పుడు సొంతింటి కోసం ఎదురుచూసిన కుటుంబాలు నేడు తమ ఇంట్లో దీపాలు వెలిగించుకుని పండుగ చేసుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే స్వయంగా వారి మధ్యకు వచ్చి వేడుకల్లో పాల్గొనడం వారిలో మరింత సంతోషాన్ని నింపిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారంలోనే కాకుండా, వారి జీవితాల్లోని సంతోషకరమైన సందర్భాల్లోనూ తోడుగా నిలవడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని పేదల ఇళ్లలో వెలుగులు నిండిన వేళ.. వారి పండుగలో భాగస్వామిగా నిలవడం ఈ దీపావళి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఆయా గ్రామస్తులు కొనియాడారు.