BREAKING
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఢిల్లీలో యమునా నదిపై తొలి విహార నౌక సేవలు ప్రారంభం, రేపు లాంఛనంగా ప్రారంభం భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు దాతరపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు

ఓట్ చోరీని అరికట్టాలి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలి!

Select Suryaa Now
ఓట్ చోరీని అరికట్టాలి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలి!

సీతమ్మధార,  సూర్య : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఏఐసిసి పరిశీలకులు డాక్టర్ జయకుమార్ పిలుపునిచ్చారు. 'ఓట్ బచావో  దేశ్ బచావో' నినాదంతో ఓటు చోరీని అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని ఆయన కోరారు. విశాఖపట్నం కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ జయకుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణలు చేశారు. అమిత్ షా ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.కేంద్రంలో మోదీ పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గరలోనే ఉందని, రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.
ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటు చోరీ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ఓట్ బచావో – దేశ్ బచావో' కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ మీడియా సమావేశంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హాసిని వర్మ, పీసీసీ ప్రధాన కార్యదర్శి గాదం మహేష్, సౌత్ ఇన్‌చార్జి కేవీ సూర్యనారాయణ, గుత్తుల శ్రీనివాస్, భీమిలి ఇన్‌చార్జి సవరివిల్లి రామకృష్ణ, మహిళా అధ్యక్షురాలు సునంద, కాండవ గాయత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంకర ఆనంద్ కుమార్, భుకారి మహమ్మద్, యువజన నాయకులు, జయంతి భరత్ చెన్న అప్పారావు, శ్రీనివాస్, కాకర అప్పారావు, వివిధ వార్డుల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.