BREAKING
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఢిల్లీలో యమునా నదిపై తొలి విహార నౌక సేవలు ప్రారంభం, రేపు లాంఛనంగా ప్రారంభం భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు దాతరపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు

**బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన పావన మూర్తి.. * ప్రథమ వర్ధంతి సభలో కొనియాడిన ప్రముఖులు *

Select Suryaa Now
**బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన పావన మూర్తి..  * ప్రథమ వర్ధంతి సభలో కొనియాడిన ప్రముఖులు  *

సీతమ్మధార, సూర్య : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన మహనీయుడు సి .పావనమూర్తి అని పలువురు ప్రముఖులు కొనియాడారు.అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని రామా టాకీస్ రోడ్డులో గల అంబేద్కర్ భవన్ లో ఆదివారం ఆయన ప్రధమ వర్ధంతి సందర్భంగా సి. పావన మూర్తి స్మారకోపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఇన్సెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మోకా సత్తిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ భవన్ నిర్మాణంలో  అగ్రగణ్యుడు సి. పావనమూర్తి అని ,ఆయన స్ఫూర్తి తీసుకొని ఎందరో అంబేద్కర్ సిద్ధాంతాల వెలుగులో దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లారని పేర్కొన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ఆయన నడుస్తూ అణిచివేతకు గురవుతున్న అనేక మందికి అండగా నిలిచారన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక భారతదేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన సామాజిక సిద్ధాంతాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయన్నారు. సామాజిక ,ఆర్థిక, రాజకీయ సమానత్వమే అంబేద్కర్ మూల సిద్ధాంతమని పేర్కొన్నారు.  రాజ్యాధికారం వచ్చిన నాడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంబేడ్కర్ దిశనిర్దేశం చేశారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న సంపద సమాన స్థాయిలో అందరికీ దక్కాలని అంబేద్కర్ సూచించారన్నారు.రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ పావన మూర్తి అందించిన చైతన్యంతో అనేకమంది అభివృద్ధి చెందారన్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కుల అణిచివేత దారుణంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కేజీహెచ్ పూర్వ సూపరిండెంట్ జి .అర్జున మాట్లాడుతూ సి. పావన మూర్తిని ఆంథ్రా పెరియార్ గా పిలుచుకోవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. రిజర్వేషన్లు ఉపయోగించుకుని పైకొచ్చిన వారు సామాజిక మార్పు కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి  జె. వి. ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ భవన్ లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని ఒక నిర్మాణానికి సి . పావన మూర్తి పేరిట నామకరణ చేయటానికి నిర్ణయించామన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి కృషి చేసిన వారిలో పావనమూర్తి  ముఖ్యులని తెలిపారు. ప్రొఫెసర్ సి. ప్రజ్ఞ మాట్లాడుతూ తన తండ్రి అయిన పావనమూర్తి జీవితం నేటితరానికి ఒక సందేశమన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి గార సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు అలమండ ప్రసాద్, సహాయ కార్యదర్శి బత్తుల గౌతం బాబు, ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, బిఎస్ఐ అధ్యక్షుడు ఎం. మల్లయ్య రాజు, భీమ్సేన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే చిన్నారావు, డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్, ఏసిపి అంబేద్కర్, రాంజీ దళిత బహుజన సంఘాల ప్రతినిధులు,  అనేక మంది పావన మూర్తి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.