రైల్వే పెన్షనర్లకు శుభవార్త!
పలాస, సూర్య : దక్షిణ కోస్తా రైల్వే, విశాఖపట్నం డివిజన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డి.ఎల్.సి) క్యాంపెయిన్ 5.0లో భాగంగా నేడు (నవంబర్ 10, 2026) మంగళవారం పలాస రైల్వే స్టేషన్ లో రైల్వే పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల కోసం ప్రత్యేక అవగాహన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.శిబిరం వేళలు..ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
అక్కడికక్కడే లైఫ్ సర్టిఫికెట్
ఈ శిబిరంలో పెన్షనర్లు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ విధానం ద్వారా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో అక్కడికక్కడే సమర్పించుకునేందుకు అవసరమైన సదుపాయాలు, సహాయ సహకారాలు అందించనున్నారు.ఇకపై బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, స్టేషన్ లోనే నిమిషాల్లో పని పూర్తి చేసుకోవచ్చు.
ఉచిత వైద్య శిబిరం కూడా
పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు, సలహాలు, సూచనలు అందించనున్నారు.
అధిక సంఖ్యలో హాజరు కావాలి - రైల్వే విజ్ఞప్తి
పలాస మరియు పరిసర ప్రాంతాల్లోని రైల్వే పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో హాజరై, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించుకోవడంతో పాటు వైద్య శిబిరం సేవలను కూడా వినియోగించుకోవాలని విశాఖపట్నం డివిజన్ విజ్ఞప్తి చేస్తోంది.పెన్షనర్ల సంక్షేమం, సౌకర్యవంతమైన డిజిటల్ సేవల అందుబాటే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, అందరి భాగస్వామ్యంతో ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తీసుకురావాల్సినవి
ఆధార్ కార్డు, పెన్షన్ పత్రాలు / పిపిఓ నంబర్, మొబైల్ ఫోన్.