BREAKING
న్యూజిలాండ్‌తో సిరీస్: అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌ రేసులో నిలిచిన గుర్నూర్ బ్రార్ **బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన పావన మూర్తి.. * ప్రథమ వర్ధంతి సభలో కొనియాడిన ప్రముఖులు * పబ్లిక్ పరీక్షల తరహాలోనే ఎస్ఏ-1 పరీక్షలు.. డిప్యూటీ డిఇఓ. గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ఆపాలంటూ... -ఆగిర్యాల లో కొనసాగుతున్న మహా నిరాహార దీక్ష ఇందిరమ్మ ఇళ్లలో వెలుగును నింపిన దీపావళి ఓట్ చోరీని అరికట్టాలి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలి! ఫామ్ కోల్పోయి ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన మార్నస్ లబుషేన్: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం లంచం అడిగితే సమాచారం ఇవ్వండి...! * ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ * అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల వివరాలు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు: ఉస్మాన్ ఖ్వాజా 'శాండ్‌పేపర్‌గేట్' బాంబు నూటికి నూరు శాతం నిజమంటూ ప్రకటన న్యాయం అందరి హక్కు * లకోర్టు ఆవరణలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం * రైల్వే పెన్షనర్లకు శుభవార్త! జయచంద్ర నాయుడుకు పాలురు ప్రజల ఘన సన్మానం తెలంగాణలో బియ్యం ధరలకు అడ్డుకట్ట.. గరిష్ట విక్రయ ధర (MRP) ఖరారు చేసిన ప్రభుత్వం!

కూటమి కుమ్ములాట లోను వైకాపా ఘోర ఓటమి

Select Suryaa Now
కూటమి కుమ్ములాట లోను వైకాపా ఘోర ఓటమి

పూసపాటిరేగ, సూర్య : స్థానిక పరిషత్ అధ్యక్ష, జడ్పిటిసి ఎన్నికల్లో పూసపాటిరేగ మండలం లో ఉన్న కూటమి కుమ్ములాటలోనూ వైకాపాకు కాలం కలిసి రాలేదని చెప్పాలి. 1987 నుంచి  అధ్యక్ష పీఠాన్ని తెదేపానే కైవసం తీసుకోగా గత పరిషత్ ఎన్నికల్లో మాత్రం వైకాపా తరుపున రెల్లివలస కు చెందిన మహంతి కళ్యాణి అప్పటి ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సహకారంతో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం కోటములో ఉన్న పార్టీలు కుమ్ములాట వలన కాలం కలిసి వస్తుందని వైకాపా విజయం సాధిస్తుందన్న భీమాను వ్యక్తం చేసినప్పటికీ కాలం కలిసి రాక గత ఎంపీపీగా మహంతి కళ్యాణి పతివాడ ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసినప్పటికీ రాజేశ్వరి చేతిలో ఓటమి చెవి చూడవలసి వచ్చింది. కళ్యాణి తండ్రి , వైకాపా మండల అధ్యక్షుడైన పతివాడ అప్పలనాయుడు పసుపం ప్రాదేశిక స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ తెదేపా అభ్యర్థి దువ్వు అప్పలస్వామి పై ఓటమి చెవి చూడవలసి వచ్చింది. ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి బరిలో పైడి మధు కూడా వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడంతో వైకాపా మండల అధ్యక్షుడు, వైకాపాడ్ నుంచి పోటీ చేసిన అప్పలనాయుడు మూడో స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రెండు స్థానాలు నుంచి గతంలో వేరే అభ్యర్థులు కావడంతో ఆ రెండు ప్రాదేశిక స్థానాల్లోనూ గ్రామాలను పట్టించుకోకపోవడంతో పాటు, అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు కూడా వాస్తవికంగా నిజమేనని ఓటర్లు నిరూపించినట్లు అయింది. గత మండల పరిషత్ నిధులతో వీరు ఎన్నికైన సిగ్మెంట్లను నిర్లక్ష్యం చేయడమే కాకుండా తమ సొంత గ్రామమైన రెల్లివలస గ్రామానికి రూ. 70 లక్షల వరకు స్వర్గధామం పేరుతో నిధులను ఖర్చు చేసి మిగిలిన సిగ్మెంట్లలో నిర్లక్ష్యం చేయడం వలన కూడా వైకాపా ఓటమికి మరో కారణంగా ఆ పార్టీ నాయకులే పేర్కొంటుండడం విశేషం. అంతేకాకుండా తాజాగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూటమిలో కుమ్ములాటల వలన ఎవరికి వారే నామినేషన్లు వేయడమే కాకుండా ఇరు పార్టీల వారికి బీ పారాలు మూడు చోట్ల వేశారు. మరికొందరు తెదేపా నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పోటీ చేశారు. మరి కొన్ని చోట్ల భాజపాకు ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ ఆయాచోట్ల పోటీ చేయడంతో కలగూర గంపల ఉన్న కూటమిని వైకాపా నాయకులు విలువరించలేకపోయింది. ఎన్నికల ప్రచారంతో పాటు అభ్యర్థుల ఎంపికలోనూ ప్రధాన లోపాల వలన వైకాపా చతుకులపడి 8 స్థానాలకే పరిమితం కాగా తెదేపా కూటమితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తెదేపాకు చెందిన వారే కావడంతో 13 స్థానాలు కూడా కూటమికి దక్కడంతో పరిషత్తు అధ్యక్ష పీఠం భరించినట్లు అయింది.