BREAKING
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఢిల్లీలో యమునా నదిపై తొలి విహార నౌక సేవలు ప్రారంభం, రేపు లాంఛనంగా ప్రారంభం భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు దాతరపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు

జాతీయ స్థాయి రోల్ ప్లే పోటీలకు ఈదులవలస పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు

Select Suryaa Now
జాతీయ స్థాయి రోల్ ప్లే పోటీలకు ఈదులవలస పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు

పోలాకి,  సూర్య : జాతీయ స్థాయి రోల్ ప్లే పోటీల్లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పీఎం శ్రీ ఏపీఎంఎస్ ఈదులవలస పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. తమ సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం, చక్కటి అభినయం, సమయస్ఫూర్తితో కూడిన ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచారు. ఈ విజయంతో విద్యార్థులు రాష్ట్ర స్థాయి రోల్ ప్లే పోటీలకు ఎంపికై పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, పోటీలకు అవసరమైన శిక్షణ అందించడంలో గైడ్ టీచర్ జె. కృష్ణారావు (టీజీటీ ఇంగ్లీష్) విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పి. ప్రవీణ, ఉపాధ్యాయ బృందం గైడ్ టీచర్ జె. కృష్ణారావును, విజేతలైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటుకుని జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో సాధించిన ఈ విజయం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహాలు నింపింది.