BREAKING
న్యూజిలాండ్‌తో సిరీస్: అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌ రేసులో నిలిచిన గుర్నూర్ బ్రార్ **బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన పావన మూర్తి.. * ప్రథమ వర్ధంతి సభలో కొనియాడిన ప్రముఖులు * పబ్లిక్ పరీక్షల తరహాలోనే ఎస్ఏ-1 పరీక్షలు.. డిప్యూటీ డిఇఓ. గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ఆపాలంటూ... -ఆగిర్యాల లో కొనసాగుతున్న మహా నిరాహార దీక్ష ఇందిరమ్మ ఇళ్లలో వెలుగును నింపిన దీపావళి ఓట్ చోరీని అరికట్టాలి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలి! ఫామ్ కోల్పోయి ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన మార్నస్ లబుషేన్: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం లంచం అడిగితే సమాచారం ఇవ్వండి...! * ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ * అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల వివరాలు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు: ఉస్మాన్ ఖ్వాజా 'శాండ్‌పేపర్‌గేట్' బాంబు నూటికి నూరు శాతం నిజమంటూ ప్రకటన న్యాయం అందరి హక్కు * లకోర్టు ఆవరణలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం * రైల్వే పెన్షనర్లకు శుభవార్త! జయచంద్ర నాయుడుకు పాలురు ప్రజల ఘన సన్మానం తెలంగాణలో బియ్యం ధరలకు అడ్డుకట్ట.. గరిష్ట విక్రయ ధర (MRP) ఖరారు చేసిన ప్రభుత్వం!

ప్రజాక్షేత్రంలో గెలిచారు... ప్రజల గుండెల్లో నిలవండి!

Select Suryaa Now
ప్రజాక్షేత్రంలో గెలిచారు... ప్రజల గుండెల్లో నిలవండి!

పెందుర్తి, సూర్య : పరిషత్ (జెడ్పిటిసి, ఎంపిటిసి) ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆదివారం పెందుర్తి శాసనసభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సుజాతనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఆదివారం నాడు పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాలకు చెందిన విజేతలు ఎమ్మెల్యే రమేష్ బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు, విజయం సాధించే వరకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించినందుకు వారు ఎమ్మెల్యేకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకున్నారు. అనంతరం, విజయం సాధించిన ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ... "మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండాలి. మీ మీ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోవాలి. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉండాలి" అని ఉద్బోధించారు. నియోజకవర్గంలోని మండలాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుండి తగిన నిధులు తీసుకువచ్చి పూర్తి అండగా ఉంటానని జెడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు.