andhrapradesh
నగరం మండల ఎంపీపీగా మోర్ల స్వరూప రాణి
నగరం, మేజర్ న్యూస్:
నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తెలుగుదేశం పార్టీ 12, జనసేన పార్టీ 2 ఎంపీటీసీ స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో నగరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి మోర్ల స్వరూప రాణి మండల ఎంపీపీగా పగ్గాలు చేపట్టారు. గతంలో నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా స్వరూప రాణి సేవలందించారు. ఈమె భర్త మోర్ల వెంకట సుబ్బారావు మంత్రి అనగాని సత్యప్రసాద్ పీఏగా పనిచేస్తున్నారు. సర్పంచ్ గా పనిచేసిన అనుభవంతో ఎంపీపీ హోదాలో నగరం మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.