ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు
సూర్య- బిక్కనూర్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు దుంపల మణెమ్మ, మెతుకు మీనా నూతన ఇందిరమ్మ గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న దుంపల మణెమ్మ, మెతుకు మీనా కుటుంబాలకు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో వారి ఆనందంలో భాగ్యస్వామ్యం కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీడీవో సవిత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు