telangana
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల భద్రపరిచే గోదాంను తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల భద్రపరిచే గోదాంను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. గోదాంలో యంత్రాల భద్రత, నిల్వ ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు.ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి స్వాతి, తహసీల్దార్ రాజు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.