telangana
అంగన్‌వాడీ పోస్టుల ప్రొవిజనల్ జాబితా ప్రదర్శన
సూర్య ఉట్నూర్: ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల నియామకాలకు సంబంధించిన ప్రొవిజనల్ జాబితాను సోమవారం నుంచి బుధవారం వరకు ఉట్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రదర్శించనున్నట్లు సీడీపీవో ఉమాదేవి తెలిపారు.ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల పరిశీలన నిమిత్తం జాబితాను కార్యాలయంలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన అభ్యర్థులు జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.జాబితాలో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలలోపు ఉట్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అందే అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారు.