అరుణాచల యాత్రకు ఏపిఎస్ ఆర్టిసీ ప్రత్యేక బస్సులు
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి పరిసర ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం ఏపిఎస్ ఆర్టీసి కనిగిరి డిపో ఆధ్వర్యంలో అరుణాచల యాత్రకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ మహమ్మద్ సయాన బేగం సోమవారం తెలిపారు.రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి, అరుణాచలం (గిరి ప్రదక్షిణం), తిరుత్తణి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణం కోసం ఈ ప్రత్యేక యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ యాత్రకు నవంబర్ 14, 22, 28 తేదీలతో పాటు డిసెంబర్ 5వ తేదీన ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.కనిగిరి డిపో నుంచి రాత్రి 9 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయని, టికెట్ ధర కేవలం రూ.2,200 మాత్రమేనని తెలిపారు.
ఆసక్తి గల భక్తులు ముందుగానే తమ సీట్లను రిజర్వేషన్ చేసుకోవాలని డిపో అధికారులు సూచించారు.మరిన్ని వివరాలు,రిజర్వేషన్ల కోసం 6301444976, 9492413742 నంబర్లను సంప్రదించాలని కోరారు.