BREAKING
న్యూజిలాండ్‌తో సిరీస్: అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌ రేసులో నిలిచిన గుర్నూర్ బ్రార్ **బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన పావన మూర్తి.. * ప్రథమ వర్ధంతి సభలో కొనియాడిన ప్రముఖులు * పబ్లిక్ పరీక్షల తరహాలోనే ఎస్ఏ-1 పరీక్షలు.. డిప్యూటీ డిఇఓ. గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ఆపాలంటూ... -ఆగిర్యాల లో కొనసాగుతున్న మహా నిరాహార దీక్ష ఇందిరమ్మ ఇళ్లలో వెలుగును నింపిన దీపావళి ఓట్ చోరీని అరికట్టాలి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలి! ఫామ్ కోల్పోయి ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన మార్నస్ లబుషేన్: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం లంచం అడిగితే సమాచారం ఇవ్వండి...! * ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ * అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల వివరాలు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు: ఉస్మాన్ ఖ్వాజా 'శాండ్‌పేపర్‌గేట్' బాంబు నూటికి నూరు శాతం నిజమంటూ ప్రకటన న్యాయం అందరి హక్కు * లకోర్టు ఆవరణలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం * రైల్వే పెన్షనర్లకు శుభవార్త! జయచంద్ర నాయుడుకు పాలురు ప్రజల ఘన సన్మానం తెలంగాణలో బియ్యం ధరలకు అడ్డుకట్ట.. గరిష్ట విక్రయ ధర (MRP) ఖరారు చేసిన ప్రభుత్వం!

గీతంలో 5జి మరియు డ్రోన్ టెక్నాలజి పై వర్క్‌షాప్

Select Suryaa Now
గీతంలో 5జి మరియు డ్రోన్ టెక్నాలజి పై  వర్క్‌షాప్

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో  “5జి మరియు డ్రోన్ టెక్నాలజీ’ అనే అంశంపై సోమవారం   మూడు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటి ఐ.టి.డి.ఎమ్. కర్నూలు కు చెందిన  డాక్టర్ ఎమ్.రవికుమార్,  గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డైరక్టర్  డాక్టర్ కె.తిరుపతిరావు, సిఎసఇ విభాగం అధిపతి ప్రొఫెసర్ జి.వి.ఎస్.రాజ్‌కుమార్, డాక్టర్ కె.నవీన్‌కుమార్ తదితరులు ముఖ్యఅతిధిగా పాల్గొనగా  ఐ.టి.డి.ఎమ్ కర్నూల్ డాక్టర్ పూట రవికిషోర్, భారత్ ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖకు చెందిన ఏ.పి.ఎల్.ఎస్.ఏ.అసిస్టెంట్ డైరక్టర్ డాక్టర్ ఎమ్.రవిశంకర్  తదితరులు రిసోర్సు పర్సన్‌లుగా పాల్గొని విలువైన సలహలు అందించారు. 
     నిపుణులు తమ ప్రసంగాలలో 5జి కనెక్టివిటి మరియు డ్రోన్లు వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రవాణ మరియు టర్బైన్ నిర్వహణ వంటి కీలక రంగాలను వేగంగా మారుస్తున్నాయని పేర్కొన్నారు.   కృత్రిమ మేధ అనేది మానవ మేదస్సుకు ప్రత్యామ్నాయం కాదని, అది ప్రతిభను పెంచే ఒక సాధనం మాత్రమేనని వారు పేర్కొన్నారు.  క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్ మరియు మానవరహిత వైమానిక వ్యవస్థల వంటి వర్ధమాన సాంకేతికతలను సమాజంలో విపరీతమైన డిమాండ్ ఉందని వారు తెలిపారు. అకడమిక్స్‌లో 5జి ల్యాబ్స్ మరియు డ్రోన్ ఇంజనీరింగ్ సరికొత్త అంశాలని కేవలం లాజికల్ అంశాలకే పరిమితం కాకుండా హ్యండ్స్ ఆన్ ప్రాక్టికల్ శిక్షనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 5జ్రి మరియు డ్రోన్లు వాడకం ద్వారా రసాయనాల వాడకాన్ని అదుపు చేయడం మరియు వాతావరణ మార్పులను తట్టుకుని దిగుబడిని పెంచడం సాధ్యమవుతుదంని స్పష్టం చేశారు. భారతదేశంలో లభిస్తున్న అపారమైన సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్ధులు, పరిశోధకులు నూతన ఆవిష్కరణలు రూపొందించాలని పిలుపునిచ్చారు. డోన్ల అమరిక, విడిబాగాల గుర్తింపు, పైలటింగ్ విధానాలు మరియు వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను అధిగమించడంపై  ఈ వర్క్‌షాప్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు.  కేవలం సిద్దాంతపరమైన జ్ఞానానికే పరిమితం కాకుండా, వాస్తవ ప్రపంచ అనువర్తనాలను నేరుగా నిపుణుల ద్వారా తెలుసుకోవడానికి ఈ మÖడు రోజుల కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని నిర్వహకులు తెలిపారు. 


       ఈ సాంకేతిక కార్యక్రమ నిర్వహణకు వర్క్‌షాప్ కోఆర్డినేటర్లుగా డాక్టర్ స్వరూప్ కుమార్, డాక్టర్ పూన వేణుగోపాల్ రావులను  వ్యవహరించారు. ఇటువంటి విద్యాపరమైన కార్యక్రమాలు అధ్యాపకులకు, విద్యార్ధులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంలో పరిశోధనలను ప్రోత్సహించడంలో మరియు భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు సిద్దం చేయడంలో తోడ్పడతాయని వారు  తెలిపారు. ఈ 5జి మరియు డ్రోన్ టెక్నాలజి వర్క్‌షాప్‌కు అధ్యాపకులు,పరిశోధకులు మరియు విద్యార్ధులు పెద్ద ఎత్తున  హజరయ్యారు.