telangana
మావల లో ఘనంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు - పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదివారం మావల మండల కేంద్రంలో 'ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకల్లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కారం స్వప్న మరియు కలగట్టు మంజుల గృహాలలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు దీపాలు వెలిగించి, లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు తినిపించుకుని ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్ రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్ , ఏఈ నశీర్ గారు, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్ , ఉప సర్పంచ్ స్వప్న అడెల్లు , దేరా కృష్ణారెడ్డి , లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.