BREAKING
పత్తి కొనుగోళ్ళు  వెంటనే ప్రారంభించాలి - మాజీ మంత్రి జోగు రామన్న పేదలకు న్యాయమే లక్ష్యం - ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా కీలక నిర్ణయం 17 ఎంపీటీసీలు గెలిచినా.. జెడ్పీటీసీ ఎందుకు చేజారింది? * నరసన్నపేట కూటమిలో మొదలైన ఆత్మపరిశీలన * మెకానిక్ వర్క్ షాప్ లో భారీ మంటలు 15 లక్షల ఆస్తి నష్టం కోడి పందాల స్థావరంపై వేంసూర్ పోలీసులు దాడి డిస్నీ, అడోబ్ కీలక ఒప్పందం పంట కుంటతో పల్లీ పంటకు నీటి తడి నార్డియా బ్యాంకుకు భారీ ఊరట చిన్నారులతో దీపావళి వేడుకలు * పండుగ సామగ్రి పంపిణీ చేసిన సైలాడ సతీష్ * ఘనంగా ఉత్తరాఖండ్ అవతరణ దినోత్సవ వేడుకలు స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి జరుపుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం విద్యుత్ బిల్లుల కేంద్రం వద్ద వినియోగదారుల తీవ్ర అవస్థలు అమెరికాను వణికిస్తున్న మాంసాన్ని తినే పురుగు ముప్పు

అనుకున్నది సాధించారు..అనుచరుల గుండెల్లో నిలిచారు

Select Suryaa Now
అనుకున్నది సాధించారు..అనుచరుల గుండెల్లో నిలిచారు

గరుగుబిల్లి, సూర్య : రాజకీయాల్లో వారసత్వం, అంగబలం, అర్థబలం ఉన్నవారికే పదవులు దక్కుతాయనేది చాలామంది నమ్మకం...కానీ ప్రజల్లో ఉండాలనే తపన, సమాజానికి సేవ చేయాలనే బలమైన లక్ష్యం ఉంటే ఏ శక్తీ మనల్ని ఆపలేదని ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి నిరూపించారు. కఠోర శ్రమ,పార్టీ పట్ల నిబద్ధత, ప్రజల్లో ఉన్న ఆదరణ కలగలసి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌ మరడాన నారాయణస్వామిని విజయతీరాలకు చేర్చాయి.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి మండల కన్వీనర్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ,పార్టీ సిద్ధాంతాలను వివరించారు.మండలం లో పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమే కాకుండా, తన సేవా గుణం తో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.తాను అనుకున్న లక్ష్యం మేరకు భారీ మెజారిటీ సాధించడమే ధ్యేయంగా రాత్రింబవళ్లు శ్రమించారు. పోలింగ్ రోజున ఓటర్లు కన్వీనర్ మరడాన నారాయణస్వామి నాయ కత్వానికి బ్రహ్మరథం పట్టారు.ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే టీడీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది.రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం పెరుగుతూ చివరకు ప్రత్యర్థులు ఊహించని రీతిలో అత్యధిక మెజారి టీతో కన్వీనర్ మరడాన నారాయణ స్వామి జయభేరి మోగించారు.టీడీపీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి సాధించిన ఈచారిత్రాత్మక విజయంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు,అభిమాను లు, గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.ముందే నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి అత్యధిక మెజారి టీతో ప్రభంజనం సృష్టిస్తూ ఘన విజయం సాధించారు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ముఖ్య నాయకుల మార్గదర్శకత్వంలో మండల కన్వీనర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.పార్టీ సూపర్ సిక్స్ పథకాలను, అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.పార్టీ క్యాడర్‌ను ఒక తాటిపైకి తెచ్చి, ప్రతి ఒక్కరినీ సమన్వయం చేయడంలో మండల టీడీపీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి చూపిన నాయకత్వ పటిమ ఈభారీ విజయానికి బలమైన పునాది వేసింది.ఈనేపథ్యంలో మండల తెలుగుదేశం పార్టీ  కన్వీనర్ మరడాన నారాయణస్వామి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటూ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు.ఉల్లిభద్ర ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి 1007 ఓట్లు మెజారిటీ సాధించారు.అనుక్షణం ప్రజల్లో ఉంటూ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసిన మండల టీడీపి కన్వీనర్ మరడాన నారాయణస్వామి ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎంతో కృషి చేశారు.మండలంలో  అత్యధిక మెజా రిటీ సాధించడమే ధ్యేయంగా బరిలోకి దిగిన ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించా రు.ప్రస్తుతం మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహి స్తున్న మరడాన నారాయణస్వామి మండల అభివృద్ధిని పరుగులు పెట్టించే ఎంపీపీగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.