BREAKING
అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం :జడ్జి రూపశ్రీ సీఎంను విమర్శిచే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ఇరాక్ ఖోర్ మోర్ గ్యాస్ ఫీల్డ్‌పై డ్రోన్ దాడి: నిలిచిన ఉత్పత్తి దక్షిణాఫ్రికా స్థానిక ఎన్నికల్లో పాలక ఏఎన్‌సీకి ఘోర పరాజయం అరుణాచల యాత్రకు ఏపిఎస్ ఆర్టిసీ ప్రత్యేక బస్సులు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ. ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి - అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్ల నివారణకు పటిష్ట చర్యలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మావల లో ఘనంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు - పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి భక్తులకు ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్ సదుపాయం జనగణన – 2027ను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* ఎట్టకేలకు కడెం నీటిని విడుదల చేసిన అధికారులు - ఆనందంలో రైతులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి అంగన్‌వాడీ పోస్టుల ప్రొవిజనల్ జాబితా ప్రదర్శన సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు - ప్రజలకు నగర మేయర్ శుభాకాంక్షలు

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి

Select Suryaa Now
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చాటిచెప్పేలా కొడంగల్‌లో ఈరోజు సాయంత్రం నిర్వహిస్తున్న మెగా రైతు మేళాకు మక్తల్ నియోజకవర్గం నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన రైతుల బస్సులను లింగంపల్లి గ్రామం నుంచి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవడం, వారి కష్టాలను తగ్గించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సాగుకు అవసరమైన వసతులు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్న ప్రజా ప్రభుత్వం....రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మెగా రైతు మేళా ద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులు, ఆధునిక సాగు విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా మక్తల్ నియోజకవర్గం నుంచి రైతులు పెద్దఎత్తున తరలిరావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.