andhrapradesh
సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీపీఎస్ కింద పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు నియామక ప్రకటన జారీ అయి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు ఒకేసారి వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ పింఛను లబ్ధిదారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. అర్హులైనవారు నిధి అంతర్జాల వేదిక (పోర్టల్) లోని మార్పిడి ఐచ్ఛికం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు సమయంలో నియామక ప్రకటన, ఎంపిక జాబితా, నియామక పత్రం మరియు విధుల్లో చేరిన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అధికారుల పరిశీలన పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుండగా, పాత పెన్షన్ విధానంలోకి మారిన ఉద్యోగులకు 'ఏపీ సవరించిన పింఛను నిబంధనలు 1980' అమలవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.