andhrapradesh
టీడీపీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలు
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ అభ్యర్థి రవి కుమార్‌ను సొంత పార్టీ నేతలే కుట్ర చేసి ఓడించారని ఆరోపిస్తూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.
సమయానికి స్పందించిన తోటి నాయకులు, కార్యకర్తలు వారిని వెంటనే అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి రవి కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సొంత నాయకులే తనను వెన్నుపోటు పొడిచి ఓడించారని కన్నీరుమున్నీరయ్యారు. ఒకవైపు స్థానిక ఎన్నికల విజయంతో సంబరాలు జరుగుతుండగా, మరోవైపు సొంత పార్టీలోనే ఈ వర్గపోరు బయటపడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.