andhrapradesh
మరో 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన విజయం ప్రజా తీర్పునకు నిదర్శనమని, రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమర్థవంతమైన నాయకత్వానికి, పాలనకు ప్రజలు ఈ ఎన్నికల్లో మరొకసారి సంపూర్ణ మద్దతు పలికారని స్పష్టం చేశారు. కూటమి అఖండ విజయాన్ని తట్టుకోలేకనే ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.