andhrapradesh
ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు
హైదరాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ అండాల సేకరణ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించి, విచారణను వేగవంతం చేసింది. చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి అండాలు సేకరిస్తున్నాయన్న ఆరోపణలపై ఇందిరా ఐవీఎఫ్, నర్మద, ఓయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ జారీ చేసిన నోటీసుల మేరకు ఆయా ఐదు ఫెర్టిలిటీ కేంద్రాల ప్రతినిధులు మంగళవారం మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కేంద్రాల ప్రతినిధులు సమర్పించిన నివేదికలు, వివరణలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మహిళా కమిషన్ స్పష్టం చేసింది.