BREAKING
లోకేష్ కనగరాజ్ సమర్పణలో రెజీనా ‘ఆర్ఎక్స్’ సినిమా ఫస్ట్ లుక్: ఉత్కంఠ రేపుతున్న పోస్టర్ పండుగ వేళా.. ప్రజాసేవే లక్ష్యంగా పారిశుద్ధ్య పనులు,  పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్న ఎస్ఐ శంకర్ అమల్లోకి వచ్చిన కొత్త ధరలు, రూ.3,540 కోట్లు ఆదా కానున్న వైనం డీప్‌వాటర్ అన్వేషణ ప్రోత్సాహకాలపై ఇన్వెస్టర్ల నిస్తేజం: ₹84 వేల కోట్ల ప్యాకేజీ ఉన్నా స్పందన కరవు చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం! * సిడిపిఓ ఎల్.సుజాత * కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి కలకలం.. ఒడిశాలో పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు నేరడిగొండ గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాల అందజేత - రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల దీపావళి వేడుకలు: ఒకే వేదికపై నమ్రత, ఉపాసన మరియు స్నేహారెడ్డి సందడి తగ్గిన ముడి చమురు ధరలు, బ్యాంకింగ్ షేర్ల జోరుతో లాభాలతో ముగిసిన సూచీలు టీకాతోనే చిన్నారికి సంపూర్ణ ఆరోగ్య రక్షణ* - చిన్నారుల భవిష్యత్తుకు టీకాలే తొలి భరోసా *డా. ఫణి భూషణ్* కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ అండ్ నియోనాటాలజిస్ట్ కిమ్స్ కడల్స్, కర్నూలు గుస్సాడి వేడుకల్లో ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహితంః టీపీసీసీ అధికార ప్రతినిధి డా. చరణ్ కౌశిక్ ఎన్విడియా పతనంతో భారత ఇన్వెస్టర్లకు షాక్: 50 శాతం ప్రీమియంతో ఈటీఎఫ్ కొనుగోళ్లు ఓటీటీలోకి వచ్చేసిన 'హ్యాపీ జర్నీ' సినిమా: డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

ఖేలో ఇండియాలో తెలంగాణ సత్తా చాటాలిః మంత్రి వాకిటి

Select Suryaa Now
ఖేలో ఇండియాలో తెలంగాణ సత్తా చాటాలిః మంత్రి వాకిటి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః  దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి, జాతీయ స్థాయిలో వారికి మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలకు తెలంగాణ క్రీడాకారులను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.మక్తల్ గ్రౌండ్‌లో ఖేలో ఇండియా ఎంపికల్లో భాగంగా ఖో ఖో క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన వసతులు, శిక్షణ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడాకారులతో, జిల్లా క్రీడా శాఖ అధికారి వెంకటేష్ తో మాట్లాడి వారి సాధన, శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.....మక్తల్‌లో ఖో ఖో క్రీడకు సంబంధించి మొత్తం మూడు ఎంపిక శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా, మొదటి శిబిరం ఈ నెల 1వ తేదీన ప్రారంభమైందని తెలిపారు. ఈ మూడు శిబిరాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన మొత్తం 15 మంది క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఖేలో ఇండియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యంగా ఖో ఖో విభాగంలో తెలంగాణ జట్టు స్వర్ణ పతకం సాధించి రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను జాతీయ స్థాయిలో చాటాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ, మెరుగైన వసతులు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించే సత్తా తెలంగాణ యువతకు ఉందన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడం ప్రభుత్వ లక్ష్యమని, క్రీడాకారులు పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేసి విజయాలు సాధించాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.