BREAKING
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అద్భుత పథకాలు : కడ్తాల్ బ్రాంచ్ మేనేజర్ సువర్చల ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక లంబాడిగూడలో,రూ.10 లక్షలతో వీఓ భవన నిర్మాణం… తుఫాను బాధితులకు బసాయి ఫుడ్స్‌ చేయూత టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంకణాలపల్లి అనురాధ 4489 ఓట్లమెజారిటీతో విజయం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్: భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు రంగం సిద్ధం హకీంపేట మెగా రైతు మేళాకు కడ్తాల్ నుంచి 4 బస్సుల్లో రైతులు పెంచికల్ పేట్ ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఏఐఎంసీ జాతీయ కార్యదర్శి బి. అదిత "రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ ను కలసిన త్రివేణి." విద్యార్థులకు న్యాయం చేయండి సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో వీఓ భవన నిర్మాణం భూమి పూజ జనసేన అధ్యక్షులు టిసి వరుణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నారాయణపురం ఎంపీటీసీ లాల్ స్వామి ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు పంట సంరక్షణపై అవగాహన రైతు గర్జన సభకు తరలిరావాలి. నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు - డి. ఎం.పండరి.

బీసీలకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలిః ప్రధాని మోదీకి ఆర్‌.కృష్ణయ్య లేఖ

Select Suryaa Now
బీసీలకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలిః ప్రధాని మోదీకి ఆర్‌.కృష్ణయ్య లేఖ

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః క్రిమిలేయర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓకే కానీ గత పది సంవత్సరాలుగా 2015 సంవత్సరం నుంచి జరిగిన అవకతవకలను, అన్యాయాలను కూడా సరిదిద్దాలని వారికి న్యాయం చేయాలనీ రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి  చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడిపై బి.సిలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత తీర్పుప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను, వ్యవసాయ ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోరాదు. అలాగే బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు – కార్పోరేషన్ల ప్రేవేట్ రంగం ఉద్యోగుల వేతనాన్ని కూడా పరిగణంలోకి తీసుకోనిరాదని స్ప్రష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 2015 నుంచి  జరిగిన అన్యాయాలను కూడా సరిదిద్ది వారికి కూడా పోస్టింగ్ ఇవ్వాలని తీర్పు చెప్పింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు గతంలో జరిగిన తప్పులను సమిక్షంచరాదని  సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన లక్షలాది మంది బీసీలకు అన్యాయం జరిగింది. కేవలం ఐఏఎస్, IPS లోనే ప్రతి సంవత్సరం 20 నుంచి 30 మందికి ఉద్యోగాలు రాకుండా అన్యాయం జరుగుతుంది. మిగతా స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారానే జరిగిన ఉద్యోగాల నియమకాలను దాదాపు 70వేల మంది బీసీలకు ఉద్యోగాలు రాకుండా పోయాయి.
ఒక వైపు రిజర్వేషన్లకు క్రిమిలేయర్ విదించడం సిద్దాంత విరుద్దంమని దేశ ప్రజలందరూ వ్యతిరేకేస్తున్నారు. అలాగే రాజ్యాంగ బద్దంగా నియమించిన మండల కమిషన్ గాని దేశంలో ఇంతవరకు నియమించిన 280 బి.సి కమిషన్లు ఎవరు కూడా క్రిమిలేయర్ విదించాలని సిపార్స్ చేయలేదు. ఇది పూర్తిగా అన్యాయం. ఉద్యోగ నియామకాలలో బి.సి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ నిబంధన విధించిన తీరు బి.సి ల పై వివక్ష,  చిన్న చూపు చూస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. కొనసాగుతున్న ఆరు రిజర్వేషన్ల వర్గాలు ఎస్సి/ ఎస్టీ/ వికలాంగులు/N.C.C/మహిళ రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ ఒక బి.సి.లకే ఎందుకు విధించారు? రిజర్వేషన్ల లక్ష్యం ఆర్థికాభివృద్ధి పధకం కాదు. పేదరిక నిర్మూలన పథకం కాదు. జనాభా ప్రకారం ప్రాతినిథ్యం లేని బి.సి. కులాలకు పాలన లో బి.సి. లకు భాగస్వామ్యం కల్పించడం ఒకటైతే – రెండవది రిజర్వేషన్ల ద్వారా చదువు, ఉద్యోగం తద్వార అధికారం లో ఈ వర్గాలకు ప్రాతినిద్యం కల్పించి సామజిక హోదా పెంచడం ఇంకొక భాగం. అలాగే ఇక రెండవ పారా మీటర్ రిజర్వేషన్ల ద్వారా అధికారం వస్తుంది. అధికారం ద్వార పెదకులాల గౌరవం పెరుగుతుంది. కుల వివక్షత పోతుంది. అధికారంలో వాటా కల్పించినప్పుడే పెదకులలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుల వివక్ష పోతుంది. కాని అర్ధం పర్ధం లేని క్రిమిలేయర్ బి.సి. లకే ఎందుకు కల్పించారు. ఇది బి.సి ల పట్ల వివక్షత కాదా? అన్యాయం కాదా! అందుకే పూర్తిగా క్రిమిలేయర్ తొలగించాలని కోరారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన బీసీ కులాలకు ఏ రంగంలో కూడా ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, సామాజిక రంగాలలో ఎక్కడా జనాభా ప్రకారం వాటా కల్పించలేదు. బీసీలకు అభివృద్ధి ఫలాలు దక్కడం లేదు. కేంద్రంలో బీసీల సంక్షేమనికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను పెంచాలని కోరారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.