BREAKING
ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

తుఫాను బాధితులకు బసాయి ఫుడ్స్‌ చేయూత

Select Suryaa Now
తుఫాను బాధితులకు బసాయి ఫుడ్స్‌ చేయూత

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
మురసు తుఫాను ధాటికి నష్టపోయిన ఇంకొల్లు మండలం గొల్లపాలెం గ్రామస్తులకు గొల్లపాలెంలో బసాయిఫుడ్స్‌రు. 55 వేల ఆర్దిక సాయం అందించింది. తుఫాను ధాటికి సర్వం కోల్పోయిన 10 మందిని గుర్తించి ఒక్కొక్కరికి రు. 5 వేల చొప్పున నగదు అందించారు. తుఫాను కారణంగా మృతి చెందిన గ్రామానికి చెందిన వేటగిరి కోటేశ్వరరావుకు రు. 5 వేలు ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. వ్యాపారమే కాకుండా ఇలాంటి విపక్తర పరిస్థితుల్లో సేవా ధృక్పధంతో బసాయి సంస్ధ పని చేస్తుందని సంస్ధ ఎం.డి జ్యోతి వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఇంకొల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోగినేని బాలకృష్ణ అధ్యక్షత వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధితోపాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న బసాయి సంస్థ చైర్మన్‌ కోటపాటి వినోద్‌ ను గ్రామస్తుల పక్షాన అభినందించారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు సి.హెచ్‌ గోపాలకృష్ణ, వెనిగండ్ల వెంకటేశ్వర్లు, చందు, సిబ్బంది పాల్గొన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిభాష, ఇంకొల్లు.