అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి
పాలమూరు,మేజర్ న్యూస్ -
ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డిగ్రీ అతిథి అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం పోస్టర్‌ను ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ,(అటానమస్),మహబూబ్‌నగర్‌లో ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. మనోహర్ మాట్లాడుతూ, డిగ్రీ అతిథి అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడమే ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఎం వీ ఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సెమినార్ హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీ సిజి టీ ఎ ,టీ సీ ఈ-జాక్ చైర్మన్ సురేందర్ రెడ్డి తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి సుమారు 300 మందికి పైగా అతిథి అధ్యాపకులు ఈ సమ్మేళనానికి హాజరుకానున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ అతిథి అధ్యాపకులందరూ ఐక్యంగా పాల్గొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని డా. మనోహర్ పిలుపునిచ్చారు.
ఎం.ఓం ప్రకాష్,మహబూబ్ నగర్