భూ వివాదాలు శాంతి మార్గంలో పరిష్కరించుకోవాలి
రాయికోడ్, ; మండలంలోని ప్రజలు భూ వివాదాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న సందర్భాల్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), 2023 సెక్షన్ 126 ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణకు బైండోవర్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే భూమి లేదా నీటి వివాదం వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితుల్లో BNSS సెక్షన్ 164 ప్రకారం సంబంధిత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ క్రమంలో నేర స్వభావాన్ని బట్టి భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 115 (గాయపరచడం), 324 (ఆస్తి ధ్వంసం), 329 (క్రిమినల్ ట్రెస్‌పాస్), 351 (క్రిమినల్ బెదిరింపులు) తదితర చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరించారు.
ప్రజలు సంయమనం పాటిస్తూ గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, భూ వివాదాల విషయంలో గొడవలకు దిగకుండా చట్టాన్ని గౌరవించాలని ఎస్సై సూచించారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని గొడవలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్సై చైతన్య కిరణ్ స్పష్టం చేశారు.