సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలి
ఆమనగల్లు రంగారెడ్డి: పిఎసిఎస్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మల్లయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఇటీవల సింగిల్ విండో డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మల్లయ్య ను మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్‌ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణ కేంద్రంలోనాయకులు, కార్యకర్తలు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు,అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రాథమిక సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సహకార సంఘం అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేసి వారి అభివృద్ధికి సహకరించాలనిసూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మండ్లి రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, ఎంగలి ప్రసాద్, బాబా, కొండల్‌రెడ్డి, ఫరీద్, మహేష్, ఫిరోజ్, రాఘవేందర్, హరిలాల్, దేవరశెట్టి మహేష్, పూసల వెంకటేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.