లక్ష్మీపూర్‌లో ఆర్థిక అక్షరాస్యత సదస్సు
సూర్య - మానకొండూర్ : లక్ష్మీపూర్ గ్రామపంచాయతీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ది బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ సాచ్యురేషన్ (ఆర్థిక సమ్మిళితత్వం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పొదుపు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా, అటల్ పెన్షన్ యోజన తదితర ఆర్థిక పథకాల విశిష్టతను బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ ప్రజలకు వివరించారు.అనంతరం ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ తొర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వృద్ధి సాధించాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉదాహరణలతో వివరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్, గ్రామపంచాయతీ కార్యదర్శి చవాలాల్, వార్డు సభ్యులు ఉప్పు శారద, రాపాక మధుకర్, మహిళా సంఘాల ప్రతినిధులు స్థానిక యువకులు పాల్గొన్నారు.