ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -
పాలమూరు యూనివర్సిటీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో ఈ రోజు నిర్వహించిన హాకీ మెన్ మరియు తైక్వాండో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్న క్రీడాకారులలో ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డా వై శ్రీనివాసులు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జి. ఎన్. శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ పోటీలకు ఎం.వి.ఎస్. డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ సత్య భాస్కర్ రెడ్డి హాజరై, క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ మాట్లాడుతూ, పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జి. ఎన్. శ్రీనివాస్ క్రీడలపై ఉన్న మక్కువతో క్రీడలకు అనేక సదుపాయాలు కల్పిస్తూ, క్రీడాకారులను అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారని, పాలమూరు విశ్వవిద్యాలయంలో క్రీడలకు సంబంధించి దాదాపు అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారన్నారు. క్రీడాకారులు మంచి ప్రతిభతో యూనివర్సిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ ట్రెజరర్ ఎస్. నిరంజన్ గౌడ్, ఎండి వహీద్ మరియు ఎస్.ఎఫ్.ఐ. స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొంటారు. ఎంపికలు పాలమూరు యూనివర్సిటీలోని పీజీ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు.
ఎం.ఓం ప్రకాష్ ,పాలమూరు యూనివర్సిటీ,మహబూబ్ నగర్..