రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలకు వనాలిక ఎంపిక
సూర్య - మానకొండూర్ :కరీంనగర్ టౌన్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 2న నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 బాలికల సెపక్తక్రా పోటీల్లో దేవంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని వి. వనాలిక ప్రతిభ కనబరిచింది. దేవంపల్లి గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ వరహాల చారి కుమార్తె అయిన వనాలిక, ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈనెల 12 నుంచి జనగాం జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుంది.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని వనాలికను దేవంపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుమన్, ఫిజికల్ డైరెక్టర్ విష్ణువర్ధన్ పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.